కేసీఆర్‌కు షాకివ్వనున్న డీఎస్ .. త్వరలో కాంగ్రెస్‌ గూటికి, మంతనాలు జరుపుతోన్న హైకమాండ్

By Siva Kodati  |  First Published Dec 16, 2021, 6:35 PM IST

టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ తిరిగి హస్తం గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. త్వరలో డీఎస్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.


టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ తిరిగి హస్తం గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. త్వరలో డీఎస్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా డి.శ్రీనివాస్ పనిచేశారు. 2004లో డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణలో Trs అధికారంలోకి వచ్చిన తర్వాత  డి.శ్రీనివాస్  టీఆర్ఎస్ లో చేరారు. Congress పార్టీలో తనను ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డిఎస్ ఆరోపించారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ జిల్లా నేతలు డి.శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. 

Latest Videos

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అప్పటి నుండి టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.ఈ విషయమై Kcr ను కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్ లభ్యం కాలేదు. అయినప్పటికీ టీఆర్ఎస్ ఎంపీ పదవికి డి.శ్రీనివాస్ రాజీనామా చేయలేదు. కొంతకాలం నుంచి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత Bjpలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. డి.శ్రీనివాస్ తనయుడు అరవింద్ గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఈ గెలుపులో డి.శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారని అంటూ వుంటారు. 
 

click me!