కిన్నెర మొగులయ్యకు మంత్రి గంగుల ఆర్థిక సాయం (Video)

By Arun Kumar PFirst Published Dec 16, 2021, 4:57 PM IST
Highlights

హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి కలిసిన తెెలంగాణ కళాకారుడు కిన్నెర మొగులయ్యను శాలువాతో సత్కరించడమే కాదు కఆర్థిక సాయం కూడా చేసారు మంత్రి గంగుల కమలాకర్.  

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ కళాకారుడు దర్శనం మొగులయ్య (kinnera mogulaiah) గురువారం సంక్షేమ, పౌరసరఫరాల  శాఖల మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) ను కలిసారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసానికి వెళ్లి కలిసిన మొగులయ్య తనకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తన కళను గుర్తించి ఆదరించడంపై మొగులయ్య ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మంత్రి  ఎదుట టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాట పాడి అలరించారు మొగులయ్య.  

గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేతులమీదుగా అందుకున్న విషయాన్ని మొగులయ్య గుర్తుచేసుకున్నారు. ఇదే తన జీవితాన్ని మార్చేసిందని మొగులయ్య మంత్రికి తెలిపారు. ప్రభుత్వం తనలోని కళాకారున్ని గుర్తించి ప్రోత్సహించడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో వున్నానని అన్నాడు.

Video

తెలంగాణ విద్యా శాఖ ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పుస్తకంలో తన కిన్నెర కళను చేర్చి విద్యార్థులకు బోదించడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. అలాగే తన కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని కళాకారులకు అందించే పదవేల రూపాయల ఫించను కల్పించినందుకు జీవితాంతం ఈ ప్రభుత్వానికి రుణపడి వుంటానని మొగులయ్య అన్నాడు. 

READ MORE  Kinnera Mogulaiah: ఆర్టీసీ సేవలపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌

కిన్నెర వాయిద్యాన్ని అభివృద్ది చేసి మరింత మంది కళాకారులను తయారు చేయాలనే తన లక్ష్యానికి ప్రభుత్వ సహకారం అందించాలని మొగులయ్య మంత్రి గంగులను కోరాడు. దీంతొ వెంటనే స్పందించిన మంత్రి తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసారు. అంతేకాదు మొగులయ్యని శాలువాతో సన్మానించారు మంత్రి గంగుల. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాంస్కృతిక రంగానికి అనేక రకాలుగా అండగా ఉన్నారని... కళాకారులకు ఉద్యోగాలు సైతం ఇచ్చారని గుర్తుచేసారు. తెలంగాణ ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగాలను నిరంతరం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రానికి చెందిన కళాకారుడు మొగులయ్యకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన డీఏం రవిందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన మొగులయ్య  పన్నెండుమెట్ల కిన్నెర వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తాడు. అరుదైన ఈ వాయిద్యంతో చక్కటి సంగీతాన్ని పలికించే కళను మొగులయ్య తండ్రి నుండి నేర్చుకున్నాడు.  ఇది అతడి వంశపారంపర్య కళ. 

READ MORE  పవన్‌ కళ్యాణ్‌ దాతృత్వం.. `భీమ్లా నాయక్‌` ఇంట్రో సింగర్‌ మొగులయ్యకి ఆర్థిక సాయం

ఈ కళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మొగులయ్యకు తెలంగాణ ఏర్పాటు తర్వాత గుర్తించి వచ్చింది. అరుదైన కళ, అద్భుతమైన గాత్రంతో సినీ హీరో పవన్ కల్యాణ్ దృష్టిలో పడ్డాడు మొగులయ్య. దీంతో అతడికి తాజాగా నటిస్తున్న బీమ్లా నాయక్ సినిమాలో పాటపాడే అవకాశాన్ని పవన్ కల్యాణ్ కల్పించారు. అంతేకాదు అతడి కిన్నెర వాయిద్యాన్ని కూడా సినిమా పాటలో వాడారు. దీంతో ఒక్కసారిగా మొగులయ్య పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. 

click me!