బీజేపీ ఆదేశిస్తే.. సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Published : Dec 16, 2021, 05:30 PM IST
బీజేపీ ఆదేశిస్తే.. సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

సారాంశం

మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై (kcr) పోటీకి సిద్దమని స్పష్టం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు.  

మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) పోటీకి సిద్దమని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్​ ద ప్రెస్‌లో పాల్గొన్న ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి టీఆర్‌ఎస్‌తో కొట్లాడటమేనని.. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమేని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. తనకు బండి సంజయ్‌కు మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని ఈటల అన్నారు. తాను టీఆర్‌ఎస నుంచి వాళ్లే బయటకు పంపేశారని చెప్పారు.

వందల ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు. రైతు బంధుకు ఇస్తున్న డబ్బులు కేసీఆర్ ఇంట్లోవి కావని, అది తెలంగాణ ప్రజల డబ్బని అని అన్నారు. దళిత బంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే తీసుకువచ్చారని విమర్శించారు. ఆ ఎన్నికల్లో తనను ఒడించడమే లక్ష్యంగా అనేక ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తనను ఒడించేందుకు వందల కోట్ల బ్లాక్ మనీ ఖర్చు చేశారని ఆరోపించారు. కానీ హుజురాబాద్ ప్రజలు నీతి, నిజాయితీ వైపు నిలబడ్డారని చెప్పారు. దళిత బంధు పథకం ప్రజల మీద ప్రేమతో తెచ్చింది కాదని.. ఓట్ల కోసం చేసిన రాజకీయం అని విమర్శించారు. కేసీఆర్‌కు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే దDalit Bandhu రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Also read: Round-up 2021: TRS vs BJP హీటెక్కిన రాజకీయాలు.. రూట్ మార్చిన కేసీఆర్.. బీజేపీకి దక్కింది ఆ ఒక్కటే..

వచ్చే ఎన్నికల్లో కూడా హుజురాబాద్‌ నుంచే పోటీ చేస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి కూడా సిద్దంగానే ఉన్నాని తెలిపారు. టీఆర్ఎస్‌లో చాలా మంది నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌‌కు భవిష్యత్తు లేదని అక్కడి నేతలే చెప్తున్నారని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటు ఉంచితే.. కేసీఆర్ ముందు రాష్ట్రం సంగతి చక్కదిద్దాలని అన్నారు. టీఆర్‌ఎస్ నేతలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. 

హుజురాబాద్ దెబ్బ కొడితే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడని అన్నారు. వద్దని చెప్పిన ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ చేరాడని ఎద్దేవా చేశారు. 7 ఏళ్లలో కేసీఆర్ అన్ని సంఘాలను చంపేశారని వ్యాఖ్యానించారు. చైతన్యాన్ని లేకుండా చేశారని విమర్శించారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో గ్రూపులు లేవని.. అంతా ఒకటిగానే ఉన్నామని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో (Bandi Sanjay) వైరం లేదని స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu