టీఆర్ఎస్‌ను వీడను.. అవన్నీ అవాస్తవాలే, ఆ ఛానెళ్లపై పరువు నష్టం దావా: ఎంపీ బీబీ పాటిల్

By Siva KodatiFirst Published Jun 17, 2021, 7:35 PM IST
Highlights

బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్. తాను బీజేపీలో చేరడం లేదని చివరి వరకు టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పాటిల్ ఆరోపించారు. 

బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్. తాను బీజేపీలో చేరడం లేదని చివరి వరకు టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పాటిల్ ఆరోపించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని యూట్యూబ్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం లేదన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీని విడిది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల పై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ బీబీ పాటిల్ హెచ్చరించారు. 

తెలంగాణాలో ప్రస్తుతం రాజకీయాలు మంచి కాక మీదున్నాయి. ఈటెల అంకం మొదలవగానే రాష్ట్రంలోని మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస లో ఇమడలేక బయటకు వెళదామనుకునే వారికి బీజేపీ మాత్రమే అవకాశంగా కనబడుతుంది. నాయకుడు లేని కాంగ్రెస్ వైపు ఎవరు కూడా తలెత్తి కూడా చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని నేతలే బయటకు వచ్చారు, వస్తున్నారు. 

Also Read:కేసీఆర్ కు సవాల్: బిజెపి అమ్ములపొదిలోకి మరిన్ని అస్త్రాలు

ఇకపోతే తెరాస ఎన్నికల్లో విజయం సాధించడం ఇది రెండవసారి. 2014, 2018ల్లో అద్భుత విజయాన్ని సాధించిన తెరాస ఈ దఫా గట్టి పోటీని ఎదుర్కోబోతుంది. దుబ్బాక, గ్రేటర్ గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ... ఎమ్మెల్సీ ఫలితాలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాలతో చతికిలపడింది. ఈటెల రాజేందర్ చేరికతో మరోసారి జోష్ కనబడుతుంది. ఈ జోష్ ని మెయింటైన్ చేయాలనీ చూస్తున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతూ తెరాస లోని అసమ్మతులకు గాలం వేస్తుంది. 

click me!