చేదు అనుభవం... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా ఎదుట జై ఈటల నినాదాలు

Arun Kumar P   | Asianet News
Published : Jun 17, 2021, 05:02 PM IST
చేదు అనుభవం... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా ఎదుట జై ఈటల నినాదాలు

సారాంశం

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గంలో ఊహించని అనుభవం ఎదురయ్యింది. 

కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కరీంనగర్ జిల్లా పర్యటనలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన గురువారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన వెళుతుండగా మార్గమధ్యలో బిజెపి నాయకులు తారసపడ్డారు. ఇలా పల్లాను చూసిన బిజెపి నాయకులు పెద్దపెట్టున ఈటల జిందాబాద్, జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఇలా పల్లాకు  ఊహించని అనుభవం ఎదురయ్యింది. 

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇటీవలే డిల్లీకి వెళ్లి బిజెపిలో చేరారు. ఈ క్రమంలోనే బిజెపి నాయకుడిగా మొదటిసారి గురువారం సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు కాట్రపల్లి ఎక్స్ రోడ్డు వద్ద చాలా మంది బీజేపీ కార్యకర్తలు జెండాలు, ప్లెక్సీలతో ఎదురుచూస్తుండగా ఎమ్మెల్సీ పల్లా కాన్వాయ్ అటువైపు వచ్చింది. 

read more  ఎంపీపీ ఏమన్నా ఎర్రబెల్లా? కేసీఆరా?.. పల్లా సోదరి బెదిరింపుల ఆడియో లీక్..

కారులో ఎమ్మెల్సీ పల్లా వున్నట్లు గుర్తించిన బిజెపి నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈటల రాజేందర్ మద్దతుగా నినాదాలు చేశారు. ముందుగా వాహనాలు వుండటంతో పల్లా కారు కాస్సేపు ఆగింది. అంతసేపూ బిజెపి శ్రేణులు జై ఈటల నినాదాలు చూస్తూనే ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?