ఆదర్శం... కరోనాతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ ఎంపీ

By Arun Kumar P  |  First Published Sep 4, 2020, 8:52 PM IST

నిత్యం ప్రజల్లో ఉండే టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య కు, ఆయన భార్యకు వారం రోజులక్రితం కరోనా పాజిటివ్ గా తేలగా ఆయన సామాన్యుడి మాదిరిగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 


హైదరాబాద్: ఆయనో పార్లమెంటు సభ్యులు. తలచుకుంటే రోజుకు లక్షలాది రూపాయల విలువ గల కార్పొరేట్  వైద్యం ఉచితంగా చేయించుకోగలడు. అయితే అందరిలా కాకుండా అవకాశమున్నా కార్పొరేట్ వైద్యాన్ని కాదని ప్రభుత్వ పరిధిలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సింప్లిసిటీ, ప్రభుత్వ వైద్యులపట్ల ఆయకున్న నమ్మకాన్ని చూసి పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆయనే రాజ్యసభ సభ్యులు, వరంగల్ జిల్లా టిఆర్ఎస్ నాయకులు బడుగుల లింగయ్య యాదవ్. 

నిత్యం ప్రజల్లో ఉండే ఎంపీ బడుగుల లింగయ్య కు, ఆయన భార్యకు వారం రోజులక్రితం కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ మహమ్మారి రోగానికి భయపడిపోయి అందరిలా లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరలేదు. ప్రభుత్వ అజమాయిషీలో నడిచే పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో ఒక సామాన్య వ్యక్తిగా చేరి వైద్య చికిత్సలు పొందుతున్నారు. 

Latest Videos

undefined

read more   కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అసెంబ్లీకి అనుమతి: తెలంగాణ స్పీకర్ పోచారం

 సామాన్యుల మాదిరిగా ఆయన నిమ్స్ లో చేరి చికిత్స పొందడం ద్వారా పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలిచారు. వారం రోజులుగా నిమ్స్ లో ఉన్న తనకు ఇక్కడి వైద్యులు ఉత్తమ వైద్యం అందిస్తున్నారని, అతి త్వరలో కరోనాను జయించి తిరిగి ప్రజా సేవలో పాల్గొంటానని ఈ సందర్బంగా బడుగుల లింగయ్య యాదవ్  పేర్కొన్నారు.

ఇప్పటికే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ శశాంక ప్రభుత్వ దవాఖానాలో వైద్యం చేయించుకున్నారు. వీరితో పాటు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా కరోనా బారినపడి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొంది ఆదర్శంగా నిలిచారు. ఇలా వీరంతా నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజలకు నమ్మకం కల్పించగా తాజాగా లింగయ్య యాదవ్ కూడా అదే పని చేశాడు. 

ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ లు కూడా కరోనా వైరస్ తో బాధపడ్డారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వివేకానంద గౌడ్ లకు కరోనా వైరస్ సోకింది. అయితే వీరంతా ఇప్పటికే కరోనా నుండి కోలుకున్నారు. 


 

click me!