తెలంగాణ గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి రామ్‌నాథ్ ఫోన్

By Siva KodatiFirst Published Sep 4, 2020, 3:28 PM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఫోన్ చేశారు. జాతీయ విద్యా విధానంపై ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌పై చర్చించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఫోన్ చేశారు. జాతీయ విద్యా విధానంపై ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌పై చర్చించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రితో పాటు వైస్ ఛాన్సెలర్లు పాల్గొననున్నారు.

అలాగే తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్రపతి ఆరా తీశారు. జాతీయ విద్యా విధానంపై విద్యా వేత్తలతో నిర్వహించిన వెబ్‌నార్ గురించి రాష్ట్రపతికి గవర్నర్ వివరించారు.

కాగా పర్ స్పెక్టివ్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసి 2020: రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ” అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ వెబ్‌నార్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

యువతరం మెండుగా ఉన్న భారత్ వంటి దేశాల్లో నైపుణ్యాల శిక్షణ, గ్లోబల్ పోటీని తట్టుకునే విధంగా ఉద్యోగితా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలను, పరిశోధనలను ప్రోత్సహించే విధంగా ఈ విద్యా పాలసీని కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటి రూపొందించిందని డా. తమిళిసై వెబ్‌నార్‌ను ఉద్దేశిస్తూ వివరించారు

click me!