వరుసగా రెండో రోజూ తెలంగాణ కేబినెట్ భేటీ: ఉద్యోగాల భర్తీపై కీలక చర్చ

By narsimha lodeFirst Published Jul 14, 2021, 2:56 PM IST
Highlights

తెలంగాణ కేబినెట్ వరుసగా రెండో రోజూ భేటీ అయింది.  ఉద్యోగాల భర్తీపై  కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోంది. 


హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై తెలంగాణ కేబినెట్  బుధవారం నాడు మరోసారి సమావేశమైంది. మంగళవారం నాడు సుధీర్ఘంగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.  ఉద్యోగ నియామకాలపై చర్చించేందుకు ఇవాళ కేబినెట్ మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

also read:జగన్ బాటలో కేసీఆర్: ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్, కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం

బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత  ప్రగతి భవన్ లో  తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.ఉద్యోగ నియామకాలు, ఖాళీల గుర్తింపు, జాబ్‌ క్యాలెండర్‌ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకొంటారు.ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజర‌య్యారు.

ఇవాళ ఉద‌యం నుంచి ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఉద్యోగ ఖాళీల‌పై క‌స‌ర‌త్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విధి విధానాలపై చర్చించనున్నారు.  కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రాజెక్టులపై  కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. 

click me!