ఉద్యమకారులంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదు: ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్

Published : Apr 18, 2022, 09:27 PM ISTUpdated : Apr 18, 2022, 09:31 PM IST
 ఉద్యమకారులంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదు: ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్

సారాంశం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు సుప్రీం అనే భ్రమను వీడాలన్నారు. పార్టీయే సుప్రీం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు.

హైదరాబాద్: ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి రాజులు కాదు, ఇది రాజరికం కాదని మంత్రి కేటీఆర్ చెప్పారు. పార్టీయే సుప్రీం అనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 

హెచ్‌ఐసీసీలో  Trs fFoundation Day ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ సభ సన్నాహక సమావేశం  సోమవారం నాడు నిర్వహించారు. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో KTR సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  నగరంలో స్వాగత ఏర్పాట్ల విషయమై చర్చ జరిగింది. అయితే ఎమ్మెల్యేల అనుమతి లేకుండా స్వాగత ఏర్పాట్లు చేయవద్దని, ఈ విషయమై నియంత్రణ ఉండాలని Uppal  ఎమ్మెల్యే bethi subhash reddy మంత్రి కేటీఆర్ ను కోరారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎదుటి వారి కంటే ఎక్కువ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి మంత్రి సూచించారు.

ఉద్యమకారులం అంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.  ఎమ్మెల్యేలు తామే సుప్రీం అనే ధోరణితో ఉన్నారన్నారు. పార్టీయే సుప్రీం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు లేరు మంత్రి పదవులుండవన్నారు. ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరించొద్దని కూడా ఆయన కోరారు. 

ఈ నెల 27న ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఐసీసీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను కూడా ప్రవేశ పెట్టనున్నారు.  పార్టీ ఆహ్వానాలు పంపిన వారే ఈ కార్యక్రమానికి రావాలని కేటీఆర్ కోరారు.

అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాను పార్టీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బస్తీలు, పట్టణాల్లో కూడా పార్టీ జెండాలను ఆవిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా ఆవిష్కరణ బాధ్యత ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులేదనని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్