తెలంగాణలో రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు నిర్వహించాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్

Published : Apr 18, 2022, 08:01 PM ISTUpdated : Apr 18, 2022, 08:05 PM IST
 తెలంగాణలో రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు నిర్వహించాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్

సారాంశం

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు జరగాలని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు జరగాలని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  డిమాండ్ చేశారు. సోమవారం నాడు హైద్రాబాద్ లో Uttam Kumar Reddy మీడియాతో చిట్ చాట్ చేశారు. Karnataka  రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలతో పాటే Telangana సీఎం KCR కూడా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లినా కూడా President పాలనలోనే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటామన్నారు. టీఆర్ఎస్  పార్టీ పోలీసులను ఉపయోగించుకొని ప్రత్యర్ధి పార్టీల నేతలపై తప్పుడు కేసులను బనాయిస్తుందన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇసుక, మైన్, లిక్కర్ దోపీడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఎన్నికలు ఎప్పుడొస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. TRS ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.పోలీస్ వ్యవస్థను నాశనం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన చెప్పారు. కొందరు ఐఎఎస్, ఐపీఎస్  అధికారులకు హైకోర్టు చెప్పినా కూడా పోస్టింగ్ లు ఇవ్వడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తనకు అనుకూలంగా పనిచేసే వారికే కేసీఆర్ పోస్టింగ్ లు ఇస్తున్నారన్నారు. స్వతంత్రంగా పనిచేసే అధికారులకు మాత్రం పోస్టింగ్ లు ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ. 10 లక్షలు తీసుకొని సీఐ, ఎస్ఐలకు పోస్టింగ్ లకు రికమండ్ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2018లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టుగా కేసీఆర్ వివరించారు. ఈ దఫా మాత్రం ముందస్తుగా వెళ్లబోమని ఆయన చెప్పారు.

కానీ కేసీఆర్ మాత్రం ఈ దఫా కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర అసంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ రంగం సిద్దం చేసుకొంటున్నారని కూడా కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్త సునీల్ ను నియమించుకున్నారు. సునీల్  సూచనలు, సలహాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు  పార్టీ కార్యక్రమాలను రూపొందించనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్