హైద్రాబాద్ బంజారాహిల్స్ భూకబ్జా కేసు: ఎంపీ టీజీ వెంకటేష్ పేరు

Published : Apr 18, 2022, 06:42 PM IST
హైద్రాబాద్ బంజారాహిల్స్ భూకబ్జా కేసు: ఎంపీ టీజీ వెంకటేష్ పేరు

సారాంశం

హైద్రాబాద్ బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా  కేసులో ఎంపీ టీజీ వెంకటేష్ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. సుమారు రూ. 100 కోట్ల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు

హైదరాబాద్: హైద్రాబాద్ Banjarahills ల్యాండ్ కబ్జా కేసులో  ఏంపీ TG Venkatesh పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో మొత్తం 80 మందిపై కేసులు నమోదు చేశారు. సుమారు రూ. 100 కోట్లు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఏపీ జెమ్స్, జ్యువెలర్స్ కు చెందిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

JCB లు, హకీ స్టిక్స్ , సీసీ కెమెరాలతో  80 మంది ఈ భూమిలోకి ప్రవేశించారు. AP Gems Properties ప్రాపర్టీస్ ను ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారు. 

అయితే ఈ స్థలంలో 25 శాతం తాను కొనుగోలు చేసినట్టుగా  ఎంపీ టీజీ వెంకటేష్ సోదరుడు  విశ్వ ప్రసాద్  తెలిపారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు అమెరికాలో  ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆదోని గ్యాంగ్ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు గుర్తించారు.బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం రోడ్ నెంబర్ టెన్ లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుకు 2005లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మరో అచ ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.

అయితే ఈ జాగా తమదేనంటూ కొందరు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత పీజీ విశ్వప్రసాద్ కొద్ది రోజుల కిందట డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు. దీంతో ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ఆదివారం ఉదయం దాదాపు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించిన కొందరు వాహనాల్లో పరారయ్యారు. 63 మందిని అరెస్ట్ చేసి ఆయుధాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరిని భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేష్, విశ్వ ప్రసాద్, వీవీఎస్ శర్మ తదితర 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. 

స్థలం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. గతంలోనూ ఈ స్థలం విషయంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. స్థలానికి చెందిన చీఫ్ సెక్యూరిటీ అధికారి నగేష్ ఇచ్చిన ఫిర్యాదు  మేరకు  పట్టుబడిన వారి పై హత్యాయత్నం కేసుతోపాటు అక్రమ ప్రవేశం, సమూహంగా వచ్చి దాడి చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.  స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్