8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టలేదా? : కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫైర్

By Mahesh KFirst Published Nov 21, 2022, 6:46 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పై విమర్శలు సంధించారు. మూడు రోజుల బీజేపీ శిక్షణా శిబిరాల్లో కిషన్ రెడ్డి చేసిన ప్రసంగంపై విమర్శలు చేశారు. ఆయనను, బీజేపీ తీరును నిలదీశారు. దయ్యాలే వేదాలు వల్లించినట్టు పేర్కొన్నారు.
 

హైదరాబాద్: బీజేపీ శిక్షణా శిబిరాల్లో కిషన్ రెడ్డి ప్రసంగంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శలు సంధించారు. టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, అధికారం కోసం తాము అడ్డదారులు తొక్కబోమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ శిక్షణా శిబిరాల్లో మాట్లాడుతున్నారని వివరించారు. ఆయన మాటలు దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉన్నదని విమర్శించారు. అడ్డదారులు తొక్కదా? మరి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టింది బీజేపీ కాదా? అని నిలదీశారు.

ఈ మూడు రోజుల బీజేపీ శిక్షణా శిబిరాల్లో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలని శిక్షణ ఇచ్చినట్టే ఉన్నదని ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాలన్ని ఎలా తిట్టాలో నేర్పతున్నట్టు ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేసిందేమీ లేదని వివరించారు. అందుకే అభివృద్ధి చూపించి ఓట్లు అడిగే పరిస్థితి బీజేపీకి లేదని తెలిపారు.

Also Read: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా: భార్యాకుమారులకు సైతం...

పార్టీ ఫిరాయింపులపై ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన విధానం వేరు, అని తాము రాజ్యంగబద్ధంగా చేరామని గుర్తు చేశారు. ఇక్కడ తాము రాజ్యాంగం 10వ షెడ్యూల్‌ ప్రకారం టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనమైనట్టు వివరించారు. అంతేకానీ, తాము టీఆర్ఎస్‌లో చేరడం వల్ల ప్రభుత్వం ఏర్పడలేదని తెలిపారు. 

హిందువులకు బీజేపీ మాత్రమే ప్రతినిధా? తాము కూడా హైందవ సంప్రదాయాలు పాటిస్తున్నాం కదా అని వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నంలో కేసులో బీజేపీ తప్పకుండా ఇరుక్కుపోతుందని, ఆ పార్టీకి కూడా ఉచ్చు బిగుస్తుందని అన్నారు. అసలు ఈ ప్రయత్నంలో తమ పాత్రనే లేదంటున్న బీజేపీ నేతలు మరి కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని నిలదీశారు. స్వామీజీల పేరుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేయడానికి ప్రయత్నించారని అన్నారు. బీజేపీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందని పేర్కొన్నారు. కాగా, మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన సమన్లకు చట్టపరంగా సమాధానం ఇస్తా అని వివరించారు. కొన్ని పార్టీలు కాలచక్రంలో కనుమరుగు అవుతాయని, అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి అని విమర్శించారు. అసలు పార్టీని నడిపే సమర్థ నేత ఎవరూ లేదని తెలిపారు.

click me!