క్యాసినో కేసు: ఏడు గంటలపాటు మంత్రి తలసాని పీఏ హరీష్ విచారణ

By narsimha lode  |  First Published Nov 21, 2022, 6:14 PM IST

క్యాసినో  కేసులో  తెలంగాణ  మంత్రి  హరీష్  రావు  పీఏ  హరీష్  ను  ఈడీ  అధికారులు  సోమవారంనాడు  ఏడు గంటలపాటు  విచారించారు. 


హైదరాబాద్:క్యాసినో  కేసులో  తెలంగాణ మంత్రి హరీష్ రావు  పీఏ  హరీష్ ను  ఈడీ  అధికారులు  సోమవారంనాడు  ఏడు గంటలపాటు  విచారించారు.క్యాసినో  కేసులో  విచారణకు  రావాలని ఈ నెల  18వ  తేదీన  హరీష్ కు  ఈడీ  అధికారులు నోటీసులు  పంపారు. ఈడీ  అధికారుల  నోటీసుల మేరకు  హరీష్  ఇవాళ  విచారణకు  హాజరయ్యారు. మంత్రి  తలసాని శ్రీనివాస్  యాదవ్  పీఏ  హరీష్  కు  చెందిన  బ్యాంకు  ఖాతాలను  ఈడీ  అధికారులు  పరిశీలించారు. ఇదే  కేసులో  మంత్రి  తలసాని  శ్రీనివాస్  యాదవ్  సోదరులు   ధర్మేంద్ర యాదవ్,  మహేష్  యాదవ్ లు కూడా  ఈడీ  విచారణకు  ఇటీవల  హాజరయ్యారు.మరో వైపు ఈ కేసులో  తలసాని  తనయుడు  కిరణ్  యాదవ్  కు  కూడా  నోటీసులు  వచ్చినట్టుగా  సాగిన ప్రచారాన్ని  కిరణ్  యాదవ్  తోసిపుచ్చారు

క్యాసినో  కేసులో  సుమారు  130  మంది జాబితాను  ఈడీ  అధికారులు  తయారు  చేశారు.ఈ  జాబితా  ఆధారంగా  ఈడీ  అధికారులు  విచారిస్తున్నారు.  ఇవాళ  ఉదయం  10 గంటల  నుండి సాయంత్రం  ఆరు  గంటల  వరకు  హరీష్ ను  విచారించారు.  క్యాసినో  ఆడేందుకు  వెళ్లిన  సమయంలో  నగదు  లావాదేవీలు  ఎలా  చేశారనే  విషయాలపై ఆరా  తీశారు.  గోవాతో పాటు  విదేశాలకు  వెళ్లిన  సమయంలో  నగదు  చెల్లింపులను  ఎలా  చేశారనే  విషయమై  ఈడీ  అధికారులు  ప్రశ్నించారు.

Latest Videos

undefined

క్యాసినో  వ్యాపారం  చేస్తున్న  చీకోటి ప్రవీణ్ కుమార్  తో  ఎలా  సంబంధాలు  ఏర్పడ్డాయనే  విషయమై  కూడా  ఈడీ  అధికారులు  హరీష్  ను  ప్రశ్నించారు. క్యాసినో  కేసులో   ఈ  ఏడాది  ఆగస్టు  మాసంలో  చీకోటి  ప్రవీణ్ కుమార్ ను  ఈడీ  అధికారులు ప్రశ్నించారు. చీకోటి  ప్రవీణ్  బ్యాంకు  లావాదేవీలను  ఈడీ  అధికారులు  ప్రశ్నించారు,క్యాసినో  విషయంలోనే  తెలుగు  రాష్ట్రాలకు  చెందిన   కొందరు  నేతలకు  ఈడీ అధికారులు  నోటీసులు జారీ చేశారు.ఈ నెల  18న  ఈడీ  విచారణకు హాజరైన   టీఆర్ఎస్  ఎమ్మెల్సీ  ఎల్. రమణ  అస్వస్థతకు  గురయ్యారు. దీంతో  ఆయనను  ఆసుపత్రికి  తరలించారు. ఇదే కేసులో  ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యే  మంచిరెడ్డి  కిషన్  రెడ్డిని ఈడీ  అధికారులు  ప్రశ్నించారు.  ఈడీ  అధికారులు  రెండు  రోజులపాటు  విచారించారు.

గోవాతో పాటు  విదేశాలకు  వెళ్లి  క్యాసినో  ఆడారనే  అనుమానం  ఉన్నవారిని  కూడా ఈడీ  అధికారులు  విచారిస్తున్నారు. చట్టబద్దంగా  కేసినో  నిర్వహించిన  ప్రాంతాల్లోనే  తాను  క్యాసినో  వ్యాపారం నిర్వహించినట్టుగా  చీకోటి ప్రవీణ్ కుమార్  స్పష్టం చేశారు.  తాను  నిబంధనలకు  విరుద్దంగా  వ్యవ హరించలేదని ప్రవీణ్ తేల్చి  చెప్పారు.క్యాసినో  ఆడేందుకు  వెళ్లినవారు  చెల్లింపుల  విషయమై  ఈడీ అధికారులు ఆరా  తీస్తున్నారు. ఆగస్టు  మాసంలో  ఈ కేసును విచారించిన  ఈడీ  అధికారులు  కొంతకాలంగా  విచారించలేదు.  అయితే  గత  నాలుగైదు  రోజులుగా  మరోసారి  ఈ  కేసు  విచారణను  కొనసాగిస్తున్నారు.  

also  read:నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్

ఇదే కేసులో  ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యే  మంచిరెడ్డి  కిషన్  రెడ్డిని ఈడీ  అధికారులు  ప్రశ్నించారు.  ఈడీ  అధికారులు  రెండు  రోజులపాటు  విచారించారు.  తెలంగాణలో  టీఆర్ఎస్ సర్కార్  అధికారంలోకి  వచ్చిన తర్వాత  పేకాట  క్లబ్ లు  మూత పడ్డాయి. దీంతో  పేకాటపై  ఆసక్తి ఉన్న వారంతా  చీకోటి  ప్రవీణ్  నిర్వహించే కేసీనోలలో  పాల్గొన్నారని  ఈడీ  అధికారులు అనుమానిస్తున్నారు.

click me!