పార్టీలో గందరగోళం సృష్టించేందుకు యత్నం, బెదరను: రాజయ్య సంచలనం

By narsimha lodeFirst Published Mar 15, 2021, 6:55 PM IST
Highlights

పార్టీలో గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ఆరోపించారు.


జనగామ: పార్టీలో గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ఆరోపించారు.సోమవారం నాడు ఆయన ఘన్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోతులు తవ్వవే గుంట నక్కల పప్పులు ఉడకవన్నారు.

తన ప్రాణం ఉన్నంతవరకు ఘన్ పూర్ గురించే మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. నోరు ఉంది కదా అని మాట్లాడితే ఊరుకోనని ఆయన స్పష్టం చేశారు. అడ్రస్ లేని వాళ్లు మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, కేటీఆర్ లంటే తనకు పంచ ప్రాణాలని ఆయన చెప్పారు.  అభివృద్ది విషయంలో స్టేషన్ ఘన్ పూర్  నియోజకవర్గం నాలుగో స్థానంలో నిలిచిందన్నారు.నీ స్థాయికి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. తాటాకు చప్పుళ్లకు బెదరనని ఆయన తెలిపారు.

తెలంగాణలో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్య డిప్యూటీ సీఎంగా కొనసాగాడు. కొంత కాలం తర్వాత రాజయ్యను కేసీఆర్ మంత్రివర్గం నుండి తప్పించారు. ఈ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా చేశారు. 
 

click me!