తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: రికార్డు స్థాయిలో పోలింగ్

By narsimha lodeFirst Published Mar 15, 2021, 5:17 PM IST
Highlights

పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్  లో గతంలో జరిగిన పోలింగ్ కంటే రెట్టింపు శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం ఎవరికి కలిసివస్తోందో రెండు రోజుల తర్వాత తేలనుంది

హైదరాబాద్: పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్  లో గతంలో జరిగిన పోలింగ్ కంటే రెట్టింపు శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం ఎవరికి కలిసివస్తోందో రెండు రోజుల తర్వాత తేలనుంది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 76..41శాతం ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో ఇదే స్థానానికి 54 శాతం ఓట్లు నమోదయ్యాయి. హైద్రాబాద్- రంగారెడ్డి -మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  67.26 శాతం ఓట్లు నమోదయ్యాయి. గతంలో ఇదే స్థానంలో 37 శాతం ఓట్లు నమోదయ్యాయి.

నల్గొండ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.  మరోసారి ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగారు.

హైద్రాబాద్ స్థానం నుండి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు విజయం సాధించారు. ఈ స్థానం నుండి ఆయన మరోసారి పోటీ చేశారు. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ ఇంతవరకు విజయం సాధించలేదు. దీంతో ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభివాణిని  టీఆర్ఎస్ బరిలోకి దింపింది.

నల్గొండ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రాములునాయక్, హైద్రాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలోకి దిగారు.లెఫ్ట్ పార్టీల మద్దతుతో హైద్రాబాద్ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, నల్గొండ స్థానం నుండి లెఫ్ట్ పార్టీల అభ్యర్ధిగా జయసారధిరెడ్డి బరిలోకి దిగారు.ఈ రెండు స్థానాలనుండి బీజేపీ అభ్యర్ధులుగా ప్రేమేందర్ రెడ్డి, రామచంద్రరావులు పోటీ చేశారు.


 

click me!