ముగిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ... 8 గంటల పాటు ప్రశ్నల వర్షం

By Siva KodatiFirst Published Sep 27, 2022, 9:40 PM IST
Highlights

హైదరాబాద్ ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు.

హైదరాబాద్ ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని మంచిరెడ్డిపై ఆరోపణలు వున్నాయని ఈడీకి వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే. 2014 ఆగస్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఆయన పర్యటించారు. అయితే విదేశీ పర్యటనలో డబ్బులు అవసరం రావడంతో అమెరికాలోని బంధువు నుంచి 2000 యూఎస్ డాలర్లను తీసుకున్నారు. 

ALso Read:కేసినో కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

అయితే తక్కువ సమయంలో రూ.88 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, థాయ్‌లాండ్ దేశాల్లో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. క్యాసినో, గోల్డ్‌మైన్‌లలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్లగా ఈడీ అనుమానిస్తోంది. ఇటీవల ఈడీ ప్రశ్నించిన ఒకరి ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

click me!