కేసీఆర్ తెలంగాణ దేవుడు... నేటి తరం అశోకుడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పొగడ్తలు

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 4:27 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో విరివిగా చెట్లను నాటి నేటి తరం అశోకుడిగా మారారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసి ఛైర్మన్ జీవన్ రెడ్డి కొనియాడారు.  

కరీంనగర్: సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి దేవుడి రూపంలో లభించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ కాలంలో అశోకుడు చెట్లు నాటించాడు అని చరిత్ర పుస్తకాల్లో చదివాం... ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న అశోకుడు సీఎం కెసిఆర్ అని కొనియాడారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో హరిత హారం ద్వారా భారీగా చెట్ల పెంపకం కార్యక్రమం అమలవుతోందన్నారు జీవన్ రెడ్డి. 

''230 కోట్ల మొక్కలు నాటడం టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యం. హరిత హారం మొదలైన తర్వాత దాదాపు 4శాతానికి దగ్గరగా అటవీ విస్తీర్ణం పెరిగింది. ఇంకో 5శాతం అటవీ విస్తీర్ణం పెరిగితే అనుకున్న లక్ష్యం సాధించినట్టే'' అన్నారు. 

''పట్టణం, పల్లె అని తేడా లేకుండా పార్కులు ఏర్పాటు చేస్తున్నాము. .వచ్చే మూడేళ్లలో హరితహారం కింద మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది'' అని జీవన్ రెడ్డి వెల్లడించారు. 

read more  ప్రారంభమైన తెలంగాణ కేబినెట్: కీలక అంశాలపై చర్చ

ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ... కేసిఆర్ 1979లోనే సిద్ధిపేటలో విరివిగా చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారన్నారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలనే సంకల్పంతోనే సీఎం హరితహారం ప్రారంభించారన్నారు. తెలంగాణ అంతటా ఇప్పుడు పచ్చదనం కనిపిస్తోందన్నారు ఫారూఖ్ హుస్సెన్.  

తెలంగాణలో కరువు కాటకాలు ఉండకూడదనే సీఎం కేసిఆర్ అటవీ విస్తీర్ణం పెంచాలని పట్టుదలతో ఉన్నారని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు. హరితహారం ఓ గొప్ప కార్యక్రమమని... ...మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మూడు కోట్ల మొక్కలు నాటే గొప్ప యజ్ఞం జరగబోతోందన్నారు. సమైక్య పాలకులు చెట్లు నాటడాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని... అప్పుడు జరిగిన నష్టాన్ని కేసిఆర్ పూడుస్తున్నారన్నారు ఎమ్మెల్సీ. 

click me!