బిడ్డా కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకో...లేదంటే ఉరికించి తంతాం: కరీంనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 3:53 PM IST
Highlights

టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి ఠాగూర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై విరుచుకుపడ్డ కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోసిన్ మండిపడ్డారు.

కరీంనగర్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మాజి ఎంపీ పొన్నం ప్రభాకర్ ని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డిది కాదని కరీంనగర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ మండిపడ్డారు. బిడ్డా కౌశిక్ రెడ్డి కబర్దార్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు... లేదంటే ఉరికించి తంతాం అంటూ హెచ్చరించారు. 

''నువ్వు కాంగ్రెస్ పార్టిలో ఉండి టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేశావు. కాంగ్రెస్ పార్టీని మోసం చేశావు. కాంగ్రెస్ టికెట్ మీద 2018న పోటీ చేసినప్పుడు నీ మొహం చూసి ప్రజలు ఓటు వేయలేదు. సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు .అది గుర్తు పెట్టుకో'' అని మండిపడ్డారు.

వీడియో

''నీవు అసలు మొగోడివి అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసి చూపించు. అలా చేస్తే నీకు కేవలం 1000 ఓట్లు కూడా రావు. నీకు ఇంతకు ముందు పడ్డ 61,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీవి. నువ్వు గనుక ఇండిపెండెంట్ గా పోటీ చేసి 1000ఓట్లు సాధించింనా నేను సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటా'' అని సవాల్ విసిరారు.

read more  కౌషిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా : భట్టి విక్రమార్క

''ఈ మధ్యలో నీకు పిచ్చి లేసింది. వాడు వీడు అని మాట్లాడితే హుజురాబాద్ కు వచ్చి నీ నాలుక కోస్తా బిడ్డా. నువ్వు ఎన్నోసార్లు పొన్నం ప్రభాకర్ కాలు పట్టుకున్నావ్... అది మాకు తెలుసు. ఆ రోజు ప్రభాకర్   చెప్పకపోతే నీకు కాంగ్రెస్ టిక్కెట్ వచ్చుండేది కాదు'' అని పేర్కొన్నారు. 

''కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితం 1987లో ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్ ప్రారంభమయ్యింది. ఆ సమయంలో నువ్వు చెడ్డి కూడా తొడగాలేదు బిడ్డా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు'' అని మోసిన్ కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. 

ఇదిలావుంటే తెలంగాణ టిపిసిసి చీఫ్ రేవంత్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఇంచార్జ్ ఠాగూర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో  కొట్టి దగ్ధం చేశారు కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు.


 

click me!