పోడు భూముల వివాదం: వ్యవసాయ పనులను అడ్డుకున్న అటవీ సిబ్బంది, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jul 13, 2021, 4:24 PM IST
Highlights

నాగర్‌కర్నూలు జిల్లాలో పోడుభూముల వివాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం దగ్గర భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు.

నాగర్‌కర్నూలు జిల్లాలో గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం దగ్గర భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. పొలాల్లో దున్నుతుంటే అడ్డుకోవడంతో గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమను అడ్డుకోవడం ఏంటన్ని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాల్సిందిగా ఎన్నోసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదని గిరిజనులు వాపోయారు. కొద్దిరోజుల క్రితం అచ్చంపేట నియోజకవర్గంలో కూడా ఇటీవల చోటు చేసుకుంది. 
 

click me!