కవిత కాన్వాయిలో.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకి ప్రమాదం

Published : Mar 18, 2020, 01:57 PM IST
కవిత కాన్వాయిలో.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకి ప్రమాదం

సారాంశం

కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది.

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది.

Also Read నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: కవిత నామినేషన్ దాఖలు...

అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే ఆ అందులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తెలిపారు. కాగా, నిజామాబాద్‌ చేరుకున్న కవిత శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu