నా పౌరసత్వంపై పిచ్చిపిచ్చి కూతలు కూస్తున్న వారికి....: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని ఫైర్

By Nagaraju penumalaFirst Published Nov 23, 2019, 3:16 PM IST
Highlights

విపక్షాలపై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. తన  పౌరసత్వం కేసును 2009 నుంచి  రాజకీయం చేసి లబ్ది పొందుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 
 

వేములవాడ: తన పౌరసత్వంపై రాజకీయాం చేస్తూ కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు 
వేములవాడ  ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు యెుక్క భారతదేశ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. చెన్నమనేని రాజ్యాంగానికి విరుద్ధంగా రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్రం ఆరోపించింది. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ విషయాన్ని దాచారంటూ ఆరోపించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. అయితే చెన్నమనేని రమేష్ యెుక్క భారతదేశ పౌరసత్వం కేంద్ర హోంశాఖ రద్దు చేయడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఊరట లభించిడంతో అనంతరం ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. 

వేములవాడ నియోజకవర్గం చేరుకున్న చెన్నమనేని రమేష్ బాబుకు నంది కమాను వద్ద టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలదండ్లతో ఘనంగా సన్మానించారు. అనంతరం చెన్నమనేనికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 

చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట: హోం శాఖ ఆదేశాలపై స్టే

ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. తన  పౌరసత్వం కేసును 2009 నుంచి  రాజకీయం చేసి లబ్ది పొందుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

తన పౌరసత్వంపైనా తన అభ్యర్థిత్వంపైనా పిచ్చిపిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు చేసినవారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాలు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప కాంట్రాక్టుల కోసం కాదన్నారు. 

ప్రజాస్వామ్యంగా గెలిచిన తనపై పదేళ్లుగా లేని కేసును సృష్టించి రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని వారిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. రాజకీయాల్లో ముందుకు పోవాలంటే ప్రజలకు సేవ చేయాలే తప్ప కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఓట్లు పడవంటూ సెటైర్లు వేశారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేనికి హోంశాఖ షాక్, భారత పౌరసత్వం రద్దు: అనర్హత వేటేనా..?

తన పౌరసత్వం కేసుపై ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు. త్వరలోనే తనై రాజకీయ కుట్ర చేస్తున్న ప్రత్యర్థులకు తగిన గుణపాఠం న్యాయం స్థానం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపరు. తనకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానులకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. 

click me!