పెద్ద కొడుకు లెక్క పెంచుకుంటే.. పుణె, బెంగుళూర్‌లలో కేసీఆర్‌పై మీటింగ్‌లు : ఈటలపై బాల్కసుమన్ ఆరోపణలు

Siva Kodati |  
Published : Jul 03, 2021, 03:27 PM IST
పెద్ద కొడుకు లెక్క పెంచుకుంటే.. పుణె, బెంగుళూర్‌లలో కేసీఆర్‌పై మీటింగ్‌లు : ఈటలపై బాల్కసుమన్ ఆరోపణలు

సారాంశం

ఈటల రాజేందర్‌పైనా బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆరెఎస్ పురుడు పోసుకుందని…ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చాడని ఆయన గుర్తు చేశారు. 

ఈటల రాజేందర్‌పైనా బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆరెఎస్ పురుడు పోసుకుందని…ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చాడని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన లాంటి వాళ్లను కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులను చేశాడని చెప్పారు. మామూలు ఈటెల రాజేందర్ ను తీసుకు వెళ్ళి ఇంట్లో పెద్ద కొడుకు లాగా కేసీఆర్ పెంచుకున్నాడని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా ప్రత్యర్ధికి పని చేసిన వ్యక్తి ఈటెల అని బాల్కసుమన్ ఆరోపించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించాడని… పుణె, బెంగుళూర్ లో పార్టీ వ్యతిరేక మీటింగ్ లు పెట్టుకున్నారని సుమన్ ఆరోపణలు చేశారు.

Also Read:ఉద్యోగాల రగడ: దమ్ముంటే ఆ ఫైల్ క్లియర్ చేయించండి, బీజేపీ నేతలకు బాల్కసుమన్ సవాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. శనివారం ఓ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు రేవంత్ ప్రవర్తిస్తున్నాడని సుమన్ ఆరోపించారు. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ రేవంతే అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌ను ఏం చేయాలని సుమన్ ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్