భార్య, కొడుకు గొంతు కోసేసి.. చివరకు తాను కూడా..!

Published : Jul 03, 2021, 02:57 PM IST
భార్య, కొడుకు గొంతు కోసేసి.. చివరకు తాను కూడా..!

సారాంశం

భార్యను, కొడుకు గొంతు కోసి ఆపై తాను గొంతు కోసుకున్నాడు. ఇంతలో అతడి ఏడేళ్ల కుమార్తె భయంతో పరుగులు తీసి పక్కింటివారికి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు

ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కొడుకును అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీ చెందిన ప్రైవేట్ ఉద్యోగి జయవర్ధన్ చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక చివరకు తన కుటుంబాన్ని అంతమొందించుకోవాలకున్నాడు.

భార్యను, కొడుకు గొంతు కోసి ఆపై తాను గొంతు కోసుకున్నాడు. ఇంతలో అతడి ఏడేళ్ల కుమార్తె భయంతో పరుగులు తీసి పక్కింటివారికి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జయవర్ధన్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై చేసిన అప్పులు తీర్చలేక భార్య, కుమారుడి గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Telangana: హైద‌రాబాద్‌లో గొర్రె, మేక‌ల ర‌క్తంతో అక్ర‌మ వ్యాపారం.. ఇంత‌కీ ర‌క్తంతో ఏం చేస్తున్నారంటే