బండి సంజయ్ వ్యాఖ్యలు: బీజేపీపై టీఆర్ఎస్ మంత్రుల ముప్పేట దాడి

Siva Kodati |  
Published : Dec 19, 2020, 04:39 PM IST
బండి సంజయ్ వ్యాఖ్యలు: బీజేపీపై టీఆర్ఎస్ మంత్రుల ముప్పేట దాడి

సారాంశం

గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు మండిపడుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే బీజేపీ నేతలు విర్రవీగుతున్నారని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

బీజేపీ రాష్ట్రాల్లో కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారా అని మరో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. బాగు పడుతున్న తెలంగాణలోకి బీజేపీని రానిస్తే భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన హెచ్చరించారు.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాలను బెదిరిస్తూ రాజకీయ దాడులా అని ఆయన నిలదీశారు. విచ్ఛిన్నానికి జరిగే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు