ఎంఐఎం నేత కాల్పులు: మజ్లిస్ సీరియస్.. ఆదిలాబాద్ శాఖ రద్దు

By Siva KodatiFirst Published Dec 19, 2020, 4:09 PM IST
Highlights

ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ తెలిపింది. పాత శాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ తెలిపింది. పాత శాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఇద్దరిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మజ్లిస్ అధినాయకత్వం ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం‌ రేపాయి.

Also Read:ఆదిలాబాద్ కాల్పులు: పోలీసుల అదుపులో ఎంఐఎం నేత.. గొడవ నేపథ్యమిదే

ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో స్థానికులను బెంబేలెత్తించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు.

ఫారూఖ్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది.

click me!