తిరమల నుంచి తిరిగి వస్తుండగా అనంతలోకాల్లోకి...

Published : Dec 19, 2020, 03:45 PM IST
తిరమల నుంచి తిరిగి వస్తుండగా అనంతలోకాల్లోకి...

సారాంశం

తిరుమలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా షాద్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాాబదుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ టాంకర్ లారీని కారు ఢీకొట్టింది.  కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మరణించారు. 

ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా హైదరాబాదులోని సైదాబాద్ కాలనీకి చెందినవారు.  తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు ఆయిల్ ట్యాంకర్ కిందికి దూసుకుని వెళ్లింది. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే