మాట తప్పిన కేసీఆర్... మేనిఫెస్టోనే సాక్షి

Published : Feb 22, 2017, 10:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మాట తప్పిన కేసీఆర్... మేనిఫెస్టోనే సాక్షి

సారాంశం

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది...? ఇప్పుడు ఏం చేస్తోంది...? మాట తప్పం... మడమ తిప్పం.. తప్పు చేస్తే తలనరక్కుంటాం అని చెప్పే సీఎం కేసీఆర్  ఈ ఫొటోకి ఏం సమాధానం చెబుతారు.

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన రఘువరన్ పాత్ర గుర్తుందా... అందులో రఘువరన్ తన పార్టీ మేనిఫెస్టోలో ఏం చెబుతారో అది అస్సలు చెయ్యరు. అదేంటని ప్రశ్నిస్తే సవాలక్ష కారణాలు చెబుతారు. అచ్చం అలాగే ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు.

 

2014 ఎన్నికల వేళ కడియం శ్రీహరి ని నియమించి తన ఆధ్వర్యంలో రూపొందించిన పార్టీ మేనిఫెస్టోలో ఆయన ఏం పెట్టారో దానికి పూర్తి విరుద్ధంగా ఈ రోజు ప్రవర్తించారు.  

 

ప్రజలకు ఉద్యమించే హక్కు అమలయ్యే వాతావరణం కలిపిస్తామని టీఆర్ఎస్ తన మేనిఫెస్టో లో చాలా స్పష్టంగా పేర్కొంది. అధికారం రాగానే ఆ మాటకు తూట్లు పొడిచింది.

 

టీఆర్ఎస్ తన మేనిఫెస్టో 31 వ పేజీలో ప్రజా ఉద్యమాలపై పార్టీ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది.

 

( టీఆర్ఎస్ మేనిఫెస్టో వెబ్ సైట్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.  http://trspartyonline.org/election-manifesto-2014)

 

 

‘ ప్రజాస్వామికమైన కార్యకలాపాలను ఎవరు చేపట్టినా వారికి ఎటువంటి అవరోధం లేనివిధంగా వారి హక్కులు కాపాడే విధంగా పరిపాలన ఉంటుంది.

 

ప్రజలు శాంతియుతంగా అహింసా మార్గంలో ఉద్యమించే హక్కు అమలయ్యే వాతావరణం నిర్మిస్తుంది. ’

 

గులాబీ పార్టీ తన మేనిఫెస్టోలో స్వయంగా పై అంశాలను పేర్కొంది.

 

తీరా ఈ రోజు ఉద్యమ సమయంలో భుజం భుజం రాసుకొని ప్రయాణించిన టీజేఏసీ ఉద్యమిస్తుంటే ఉక్కు పాదంతో అణిచివేస్తుంది.

 

ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి...  పాలక పార్టీ మాట తప్పినట్లు... మడ తిప్పినట్లు చెప్పడానికి.

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి