
ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. జేఏసీ తలపెట్టిన నిరసన ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుపడడంతో తీవ్ర నిరాశకు గురైన ఓ విద్యార్థి ఓయూఆర్ట్స్ కళాశాల ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు.
సందీప్ చవాన్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రాణాలు కాపాడారు.
కాగా, అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు వర్సిటీ బంద్ కు ఓయూ స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది.
అరెస్టు చేసిన నాయకులు, విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు , టీజేఏసీ నేతలు కూడా అరెస్టుపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.