జగ్గారెడ్డిపై సీఈఓ శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు..

By SumaBala BukkaFirst Published Dec 3, 2021, 1:36 PM IST
Highlights

ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ జగ్గారెడ్డి ఓటర్లకు ఫోన్లు చేసారని ఆరోపించారు. ఈ సందర్భంగా  టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సి ఎన్నికలు వచ్చాయి. కొన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గెలుపే లక్ష్యంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నారు. 

టీఆర్ఎస్ నేతలు  Srinivas Reddy, Bharat లు బుద్ధభవన్ లో సీఈఓ శశాంక్ గోయల్ ని కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఎంపిటిసి, జెడ్పిటిసీలను ప్రలోభ పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. 

ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ జగ్గారెడ్డి ఓటర్లకు ఫోన్లు చేసారని ఆరోపించారు. ఈ సందర్భంగా  టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సి ఎన్నికలు వచ్చాయి. కొన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గెలుపే లక్ష్యంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నారు. 

టీఆర్ఎస్ నేత భరత్ మాట్లాడుతూ... ‘Congress MLA Jaggareddy ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓట్లకు ముందు 50వేలు, ఓట్ల తర్వాత రెండు లక్షలు ఇచ్చేట్టు paid న్యూస్ వేయిస్తున్నాయి. ఎన్నికల ముందే కాంగ్రెస్ పారర్టీ పేపర్ ప్రకటనలు చేస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతుంది. ఇది కచ్చితంగా నేరమే’ అని మండిపడ్డారు.

దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిణి కోరాం అని భరత్ అన్నారు. తమ అభ్యర్థనకు ఎన్నికల అధికారి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. 

ఇదిలా ఉండగా, నవంబర్ 26నాడు ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు 20 వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పిస్తానని హరీష్ రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు.  నిర్మాలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు 20 వేల కోట్లు తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ప్రజాప్రతినిధులపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన state bifurcation తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులకు పదవులు వచ్చాయని, కానీ వారికి పవర్ లేదన్నారు. 

టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కే... అందుకే బలం లేకున్నా ఎమ్మెల్సీ బరిలో: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పూర్వ మెదక్ జిల్లా నుంచి ఆర్ధికమంత్రి ఉన్నా నిధులు శూన్యమంటూ హరీశ్ రావుపై ఫైరయ్యారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటారని జగ్గారెడ్డి ఆరోపించారు. మెదక్‌లో కాంగ్రెస్‌కు 230 ఓట్లు ఉన్నాయని.. గెలిచే ఓట్లు లేకున్నా తన భార్య నిర్మలను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో పెట్టానని జగ్గారెడ్డి  స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టాం కాబట్టే ఎంపీటీసీ, జడ్పీటీసీలతో హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. 

మరి రెండేళ్ల నుంచి Harishrao ఏం చేశారని Jaggareddy ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలని.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లనే  హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపించి రాజా బతుకు బతుకుతారో.. టీఆర్ఎస్‌ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోవాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన హితవు పలికారు. 

click me!