సైకిల్ కి ఓటువేయాలంటూ... టీఆర్ఎస్ నేత ప్రచారం

By telugu teamFirst Published May 3, 2019, 10:21 AM IST
Highlights

టీఆర్ఎస్ మహిళా నేత ఉమా మాధవరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరబోయి... సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 

టీఆర్ఎస్ మహిళా నేత ఉమా మాధవరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరబోయి... సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దీంతో ఒక్కసారిగా పార్టీ నేతలు అవాక్కయ్యారు. వెంటనే పొరపాటును గుర్తించిన ఆమె... తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం  ప్రాదేశిక  ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిందే. బొమ్మలరామారం జెడ్సీటీసీ అభ్యర్థిగా ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేస్తున్నాడు. ఆయన తరపున ప్రచారం నిర్వహించిన ఉమా పొరపాటుగా మాట్లాడి నాలుక్కచురుకున్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరి అక్కడున్న వారందర్నీ షాక్‌కు గురిచేశారు.

 పక్కనే ఉన్న సందీప్‌రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు కారు గుర్తు అని సూచించడంతో తేరుకున్న ఆమె.. కారు గుర్తుకు ఓటేసి సందీప్‌రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరినా ఉమా మాధవరెడ్డి పాత పార్టీని మరచిపోనట్టున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

click me!