బస్సులో కాల్పులు..కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై చర్యలు: ఏపీ డీజీపీ

By Siva KodatiFirst Published May 3, 2019, 9:03 AM IST
Highlights

హైదరాబాద్ పంజాగుట్ట శ్మాశాన వాటిక వద్ద గురువారం సిటీ బస్సులో కాల్పుల ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారు. 

హైదరాబాద్ పంజాగుట్ట శ్మాశాన వాటిక వద్ద గురువారం సిటీ బస్సులో కాల్పుల ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారు.

తోటి ప్రయాణికుడితో వాగ్వాదం జరగడంతో.. ఆహ్రానికి గురైన శ్రీనివాస్ సర్వీస్ రివాల్వర్ తీసి బస్సు పైకప్పుపై గురిపెట్టి కాల్పులు జరిపాడు. దీంతో బస్సు పైకప్పులోంచి తూటా దూసుకెళ్లింది. కాల్పుల శబ్ధంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చాలామంది బస్సులోంచి దూకేశారు.

తుపాకీ పేలుడుతో ఉలిక్కిపడిన బస్సు డ్రైవర్ బస్సును ఆపి.. వెనక్కి వచ్చి చూడగా ప్రయాణికులు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

కాల్పుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో శ్రీనివాస్‌పై ఆయన విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా అతనిని విధుల నుంచి సస్పెండ్ చేస్తామని డీజీపీ ప్రకటించారు.

ప్రజల మధ్య కాల్పులు జరపడం నేరంగా పరిగణిస్తున్నామన్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఎలాంటి పని ఒత్తిడి లేదని అయినప్పటికీ అతను ఎందుకు అలా ప్రవర్తించాడో విచారణలో తేలుతుందన్నారు. నెల్లూరు జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ హైదరాబాద్‌లో ఒక ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. 

click me!