జడ్పీటీసీ టిక్కెట్టు దక్కలేదని టీఆర్ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

Published : May 06, 2019, 04:12 PM IST
జడ్పీటీసీ టిక్కెట్టు దక్కలేదని టీఆర్ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

సారాంశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాబెజ్జంకి మండలం నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు  టిక్కెట్టు దక్కనందుకు మనోవేదనకు గురైన శంకరయ్య అనే టీఆర్ఎస్ నేత సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాబెజ్జంకి మండలం నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు  టిక్కెట్టు దక్కనందుకు మనోవేదనకు గురైన శంకరయ్య అనే టీఆర్ఎస్ నేత సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన శంకరయ్య  తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. బెజ్జంకి నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆయన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సంప్రదిస్తే ఆయన నిరాకరించినట్టుగా తెలుస్తోంది. 

 దీంతో మనోవేదనకు గురైన శంకరయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో శంకరయ్యను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. శంకరయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ