ఈతకొడుతుండగా గుండెపోటు.. టీఆర్ఎస్ నేత మృతి..

Published : Dec 15, 2021, 01:13 PM ISTUpdated : Dec 15, 2021, 02:38 PM IST
ఈతకొడుతుండగా గుండెపోటు.. టీఆర్ఎస్ నేత మృతి..

సారాంశం

గండమళ్ల వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన సహచరులు ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు తెలిపారు. 

ఖమ్మం : ఇల్లెందు పట్టణంలోని కాకతీయ నగర్ కు చెందిన TRS నాయకుడు గండమళ్ల వెంకటేశ్వర్లు (55) చెరువులో swimming చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. 

ఇది గమనించిన సహచరులు ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలం ఏఐటీయూసీలో పనిచేసిన ఆయన కార్మిక నాయకుడిగా పట్టణ ప్రజలకు పరిచితుడు. అనంతరం టీఆర్ఎస్ లో చేరాడు. మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. 

ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అసలే ఇరుకైన బ్రిడ్జి.. పైగా 2 బస్సులు పక్క పక్కనే వచ్చాయి. అంతే భయంతో Footpath పై నడుచుకుంటూ వస్తున్న ఓ బాలుడు  అవి తనపైకి  వస్తాయేమోనని  భయాందోళనలతో బ్రిడ్జి మీది నుంచి కిందికి దూకేసాడు. 

బ్రిడ్జ కింద నీళ్లు ఉండడంతో తనకు ఏమీ కాదనుకున్నాడో ఏమో తెలియాదు కానీ.. బాలుడు నేరుగా నీళ్లలో పడలేదు. ఈ ఘటనలో ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. కానీ అతని రెండు Legs broken అయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీమనబోయిన ఈశ్వర్ (14) నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

టిప్పు ఇవ్వలేదని.. కస్టమర్లను చితకబాదిన వెయిటర్.. హైదరాబాద్ లో ఘటన..

రోజులాగే మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ఈశ్వర్ మార్గమధ్యంలో  మున్నేరు బ్రిడ్జి  ఫుట్ పాత్ మీదుగా నడుస్తున్నాడు.  అదే సమయంలో బ్రిడ్జి మీదుగా వస్తున్న రెండు బస్సుల్లో.. ఓ బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ రెండు బస్సులు పక్కపక్కనే ఫుట్ ఫాత్ ను అనుకుంటూ వచ్చాయి. 

బస్సులను గమనిస్తున్న ఈశ్వర్ అప్పటికే బ్రిడ్జి రెయిలింగ్ ను ఆనుకుని ఉండగా.. ఇంతలో హఠాత్తుగా ఒక బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. అది తనను చూసే కొట్టాడనుకున్నాడో ఏమో.. భయంతో బస్సు తనకు ఢీకొడుతుందేమో అని వణికిపోయాడు. అంతే, ముందూ, వెనకాల ఆలోచించకుండా అమాంతం ఒక్కసారిగా బ్రిడ్జి పైనుంచి కింద ఉన్న నీళ్లలో దూకేశాడు.

అయితే, నీళ్లలో నేరుగా పడితే ప్రమాదం ఉండకపోయేది. కానీ పడడం పడడం నీటిలో కొద్దిగా తేలిన బండమీద పడడంతో బాలుడి రెండు కాళ్ళు విరిగి పోయాయి. స్థానికులు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ అశోక్ ఇచ్చిన సమాచారం మేరకు ఈశ్వర తండ్రి శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చారు. స్థానికుల సాయంతో బాలుడిని రోడ్డుపైకి తీసుకు వచ్చి ఆసుపత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?