దక్కని టికెట్... బాబు మోహన్ సంచలన కామెంట్స్

Published : Sep 14, 2018, 12:35 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
దక్కని టికెట్... బాబు మోహన్ సంచలన కామెంట్స్

సారాంశం

ఇదంతా నాపై కక్షగట్టి చేశారు. కావాలనే క్రియేట్ చేశారంతే అంతకుమించి ఏమీ లేదు. ప్రజలకు నిజానిజాలేంటో తెలుసు" అని బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు.

టీఆర్ఎస్ నేత బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ జాబితాలో బాబు మోహన్ కి చోటు దక్కలేదు. కాగా ఈ విషయంపై ఓ ప్రముఖ మీడియా ఛానల్ అడిగిన కొన్ని ప్రశ్నలకు బాబు మోహన్ సమాధానాలు ఇచ్చారు. అంతేకాకుండా పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు.

రూపాయి ఖర్చుపెట్టి ఎప్పుడూ తాను ఓటు అడగలేదని మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎవరి దగ్గరా రూపాయి కూడా లంచం  తాను తీసుకోలేదని ప్రజలంటే తనకు అంత గౌరవమని ఆయన స్పష్టం చేశారు.

" పొలిటీషియన్‌గా అబద్ధమాడను.. తప్పుచేయను. అబద్ధమాడిన వాడిని వదిలిపెట్టను ఇదీ నా క్యారెక్టర్. రాజకీయాల్లో 24 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ప్రజలకు సేవలు చేసి వారి దీవెనలు పొందాలనే ఆలోచిస్తాను తప్ప జనం మీద పడి వసూళ్లు చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు.. అనుకోను కూడా అలా చేయడం నా క్యారెక్టర్ కాదు. అప్పట్లో జరిగిన ఎమ్మార్వో వివాదం అంతా ఓ కీలకనేత డబ్బులిచ్చి మీడియాలో రాయించారంతే.. ఇదంతా నాపై కక్షగట్టి చేశారు. కావాలనే క్రియేట్ చేశారంతే అంతకుమించి ఏమీ లేదు. ప్రజలకు నిజానిజాలేంటో తెలుసు" అని బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

కోపంతో కార్యకర్తను తన్నబోయిన బాబు మోహన్ (వీడియో)

బాబు మోహన్ కి చుక్కలు చూపించిన గ్రామస్థులు

జర్నలిస్టు క్రాంతి పై బాబుమోహన్ ఫైర్

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్