బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

By narsimha lodeFirst Published Sep 14, 2018, 12:29 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు టీడీపీ నేతలకు ధర్మాబాద్  నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేయడంపై టీ.టీడీపీ నేతలు  హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు.

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు టీడీపీ నేతలకు ధర్మాబాద్  నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేయడంపై టీ.టీడీపీ నేతలు  హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు.

2010 లో బాబ్లీ ప్రాజెక్టు సందర్శించిన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడు తో పాటు పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులను ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది.ఈ కేసులో భాగంగా  చంద్రబాబునాయుడు సహా పలువురు టీడీపీ నేతలకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకొన్న నేపథ్యంలో  తెలంగాణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కోర్టు వారంట్ జారీ చేయడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయమై హైద్రాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ నేతలు  సమావేశమయ్యారు.  మోడీ, కేసీఆర్ కుమ్మకయ్యారని తేటతేల్లమైందని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నోటీసులపై తేదీలను ఎందుకు మార్చారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

సమయానుకూలంగా  ఈ కేసును ఉపయోగించుకోవాలని భావించి ఇప్పుడు నోటీసులను ఇచ్చారని పెద్దిరెడ్డి ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు చేయడంలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తున్నందున  కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకొందన్నారు. ఐక్యరాజ్యసమితో ప్రసంగించే అవకాశం బాబు దక్కకుండా చేయడానికే  మోడీ ఈ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నోటీసులకు సమాధానమిస్తామని ఆయన చెప్పారు. 

ఈ వార్తలు చదవండి

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

click me!