
అధికారం.. అహంకారం.. సయామి కవలల్లాంటివి.. ఒకటితో పాటు ఇంకోటి పవర్ ఫుల్ ప్యాకేజీలా అతుక్కొని వస్తాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఫేస్ బుక్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో..
నీళ్లు ..నిధులు.. నియామకాల కోసం సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వివిధ పార్టీల నేతలు చేసిన పోరాటాలు వెలకట్టలేనివనే విషయం ఎవరూ కాదనలేని సత్యం.
కానీ, ఏం లాభం .. వారి పోరాటాలకు ఎవరూ వెల కట్టలేరని తెలంగాణ ప్రజలు భావిస్తుంటే ఆయా పార్టీ చోటా మోటా నేతలు మాత్రం వారి పోరాటాల పేరు చెప్పి అప్పడే ధర నిర్ణయించుకున్నారు. ఆ మంత్రి నాకు తెలుసు, ఈ అధికారి నాకు క్లోజ్ అంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నారు.
ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థం అవుతుంది.
https://www.facebook.com/rambabu.gali.7/videos/977207175756661/
సూర్యాపేట జిల్లాలో నేత ఈదులూరి సంతోష్ చేస్తున్న అరాచకం ఇది. మంత్రులందరూ నాకు తెలుసు అని.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుండి లక్షల్లో వసూలు చేశాడు.ఇతగాడు అధికార పార్టీనేతగా చెప్పుకుంటున్నట్లు కూడా అంతా అనుకుంటున్నారు.
అయితే డబ్బులిచ్చిన వారు ఉద్యోగం రాకపోవడంతో సదరు నేతను అడగడానికి వస్తే ఇలా తన ప్రతాపాన్ని చూపారు. నిరుద్యోగులను తన గదిలో నిర్బంది౦చి చితకబాదారు.
కాళ్ళు పట్టుకున్నా కనుకరి౦చకుండా కడుపులో తన్ని అధికారం..అహంకారం ఎలా ఉంటాయో పాపం వారికి రుచి చూపించారు.