తెలంగాణా కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు

Published : Feb 03, 2017, 06:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణా  కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు

సారాంశం

కోదండరాం కోపంతో ఉన్నా ప్రజలు మాతోనే ఉన్నారనేందుకు టిఆర్ ఎస్ కు ఈ ఎన్నికలు మరొక అవకాశం కల్పిస్తాయి

ఒక పక్క  ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని టిజెఎసి ఉద్యమ బాట పడితే, టిఆర్ ఎస్ పార్టీ చిన్నవో పెద్దవో మరొద దఫా ఎన్నికలకు సిద్దమవుతుంది.

 

పార్టీలకున్న సౌలభ్యం ఏమిటంటే, ఎన్నికల ప్రజాతీర్పు కాబట్టి ప్రజా తీర్పు అనుకులంగా వస్తే,   ప్రతిపక్ష విమర్శలను ప్రజలు తిరస్కరించారని రూలింగ్ పార్టీ వాదిస్తుంది. భూములు కోల్పోతున్న రైతులు,  ఉద్యోగాలు రాని యువకులను కోదండరామ్ పెద్ద ఎత్తునసమీకరిస్తున్నారు.

 

నిరుద్యోగులతో ఆయన ఫిబ్రవరి మూడో వారంలో పెద్ద ర్యాలీ కూడా తీస్తున్నారు.  ఈ నేపథ్యంలో  కౌన్సిల్లో ఖాళీ అవుతున్న కొన్ని సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు  నోటీఫికేషన్ తొందర్లో వెలువడనుంది. ప్రజలు మాతోనే ఉన్నారనేందుకు టిఆర్ ఎస్ కు ఈ ఎన్నికలు మరొక అవకాశం కల్పిస్తాయి. మండలిలో ప్రస్తుతం మండలి (40)లో ప్రస్తుతం టిఆర్ఎస్ కు 30, కాంగ్రెస్ కు 7, ఎంఐఎంకు 2,, బిజెపికి ఒకటి వున్నాయి. తెలుగుదేశం పూర్తి తుడిచిపెట్టుకుపోయింది.

 

మొత్తం ఖాళీలకు ఎన్నికలు జరుగనున్నాయి. సిటింగ్ సభ్యుల పదవీకాలం తొందరల్లో ముగుస్తున్నది. కాబట్టి ఈ లోపు ఎన్నికల నిర్వహించాలి. అసెంబ్లీ నుంచి 3, స్థానిక సంస్థల కోటాలో 1, టీచర్స్ కోటాలో 1, గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, హైదర్ రజ్వీ, మాగం రంగారెడ్డి లు  మార్చి 29న రిటైర్ అవుతారు. 


నామినేటెడ్ ఎమ్మెల్సీలయిన డీ రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్, జాఫ్రీల గడువు మే 27 దాకా ఉంది . ఖాళీ అయ్యే నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా పూర్తిచేసింది. మండలిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. రెండున్నరేండ్లలో పలువురు ఎమ్మెల్సీలు ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌ ఇంకా బలపడేలా చేశారు.  

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం