టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం....

Published : Oct 02, 2018, 08:05 PM ISTUpdated : Oct 03, 2018, 02:14 PM IST
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం....

సారాంశం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా ప్రమాదాల బారిన పడుతుండటం ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంట్లో స్నానం చేస్తూ కాలుజారి పడిపోయిన విషయం తెలిసిందే. అతడి తలకి తీవ్ర గాయమవడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా ప్రమాదాల బారిన పడుతుండటం ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంట్లో స్నానం చేస్తూ కాలుజారి పడిపోయిన విషయం తెలిసిందే. అతడి తలకి తీవ్ర గాయమవడంతో
హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

తాజాగా మరో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురయ్యారు. మహబూబ్ నగర్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇలా బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో అతడు రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి వద్ద జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును వెనుకవైపు నుండి ఓ టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుండి జైపాల్ సురక్షితంగా బైటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మాత్రం బాగా దెబ్బతింది. దీంతో మరో కారులో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.

మాజీ ఎమ్మెల్యేకు యాక్సిడెంట్ అయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.... హైదరాబాద్ కు తరలింపు

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌