టీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే కాంగ్రెసోళ్ల మైండ్ బ్లాంక్ ఖాయం: హరీష్ రావు

Published : Oct 02, 2018, 07:31 PM IST
టీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే కాంగ్రెసోళ్ల మైండ్ బ్లాంక్ ఖాయం: హరీష్ రావు

సారాంశం

కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అంటే మాటతప్పే పార్టీకి కేరాఫ్ అడ్రస్ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ఢిల్లీకి గులాంగిరి చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. 

సిద్దిపేట: కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అంటే మాటతప్పే పార్టీకి కేరాఫ్ అడ్రస్ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ఢిల్లీకి గులాంగిరి చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం సిద్దిపేట నియోజకవర్గంలోని దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ మాట తప్పేది కాంగ్రెస్ అయితే.. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. 

తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అన్నారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలో పూర్తికానుందని హరీష్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?