ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విషయమై టీఆర్ఎస్ బృందం ఈసీ అధికారులతో చర్చించనున్నారు.
హైదరాబాద్: జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ ఏర్పాటు విషయమై ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ నెల 5వ తేదీన జాతీయపార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు. దసరా పర్వదినం రోజునే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. అదే రోజున టీఆర్ఎస్ శాసనసభపక్షం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.టీఆార్ఎస్ఎల్పీతో పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు.జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై ఇవాళ పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు.
ఈనెల 6వ తేదీన జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్లనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇబ్బందులు కల్గిస్తే న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కూడా టీఆర్ఎస్ సంసిద్దంగా ఉంది. జాతీయ పార్టీఏర్పాటు కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత మాసంలో నిజామాబాద్ లో నిర్వహించిన సభలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.
undefined
గజ్వేల్ లోని తన ఫామ్ హౌస్ నుండి జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు నిర్వహిస్తున్నారు. మాజీ స్పీకర్ మధుసూధనాచారి వంటి కీలక నేతలు మాత్రమే జాతీయపార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ తో చర్చల్లో పాల్గొంటున్నారు. పార్టీ జెండా, ఎజెండా వంటి అంశాలు ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే సమావేశంలో జాతీయ పార్టీకి సంబంధించి కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేసీఆర్ కోసం విమానం కొనుగోలు చేయాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.
alsoread:
దేశ వ్యాప్త పర్యటనను మహారాష్ట్ర నుండి ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కరీంనగర్ నుండి జాతీయపార్టీకి సంబంధించి పర్యటనను ప్రారంభించాలనే చర్చ కూడా పార్టీలో ఉంది. కరీంనగర్ సెంటిమెంట్ కేసీఆర్ కు కలిసి వచ్చింది. దీంతో కరీంనగర్ నుండే జాతీయపార్టీ ప్రచారం మొదలు పెట్టాలనే చర్చ కూడ పార్టీలో ఉంది.జాతీయపార్టీ ఏర్పాటు చేసినందున మహరాష్ట్ర నుండి దేశ వ్యాప్త పర్యటనను ప్రారంభించాలనే మరికొందరు నేతలు సూచిస్తున్నారు.
also read:జాతీయ పార్టీ ఏర్పాటు: రేపు యాదాద్రికి కేసీఆర్
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ,కాంగ్రెసేతర పార్టీల సీఎంలు, నేతలను కేసీఆర్ కలుస్తున్నారు.బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. తమతో సన్నిహితంగా ఉన్న పార్టీలతోనే కేసీఆర్ చర్చలు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉండి ప్రస్తుతం ఎన్డీఏకు దూరంగా పార్టీలతో కేసీఆర్ ఎందుకు చర్చలు జరపడం లేదో చెప్పాలని ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ ప్రశ్నించారు. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ పరోక్షంగా బీజేపీకి సహకరించేలా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరో వైపు తెలంగాణలో ఏం సాధించకుండా జాతీయ పార్టీ ఏం చేస్తారని కేసీఆర్ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.