నల్గొండ లో ఉద్రిక్తత: బీహర్, స్థానిక లేబర్ల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి

Published : Oct 02, 2022, 10:26 AM IST
 నల్గొండ లో ఉద్రిక్తత: బీహర్, స్థానిక లేబర్ల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి

సారాంశం

నల్గొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ లేబర్ అడ్డా వద్ద  బీహర్, స్థానికుల వర్కర్లకు మధ్య ఆదివారం నాడు ఘర్షణ చోటు చేసుకుంది.ఇరు వర్గాలు  రాళ్ల దాడికి దిగారు.    

నల్గొండ: పట్టణంలోని భాస్కర్ టాకీస్ లేబర్ అడ్డా వద్ద ఆదివారం నాడు  బీహర్, స్థానిక కూలీల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే భాస్కర్ టాకీస్ లేబర్ అడ్డా వద్దకు చేరుకుని  పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. పని విషయమై స్థానిక కూలీలు, బీహర్ కూలీల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ వాగ్వాదం రాళ్ల దాడికి దారితీసింది. స్థానిక కూలీలపై బీహార్ కూలీలు రాళ్లతో దాడికి దిగారు. ఎదురు దాడికి స్థానిక కూలీలు ప్రయత్నించారు. కానీ బీహర్ కూలీల రాళ్లదాడితో స్థానిక కూలీలు అక్కడి నుండి పారిపోయారు.   రాళ్లదాడితో ఈ దారి గుండా వెళ్ళిన పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..?