కాంగ్రెస్ లో చేరిన టిఆర్ ఎస్ దళిత మహిళా సర్పంచ్

First Published Mar 3, 2017, 9:21 AM IST
Highlights

తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి రాబడి మొదలయింది. 

తెలంగాణా వచ్చాక కాంగ్రెస్  పోగొట్టుకోవడమే గాని, రాబట్టుకోవడం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను పొగొట్టుకుంది. ఎమ్మెల్సీలు పోయారు. ఒక ఎంపి కూడా ఉడాయించడం జరిగింది.  ఇలాంటి కాంగ్రెస్ కు రాబడి మార్గం ఏమిటి? ఇలా దిక్కుతోచనపుడు  గట్టు టిఆర్ ఎస్ మహిళా సర్పంచు  కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఆమెకు కండువా కప్పి గద్వాల ఎమ్మెల్యే డి కె అరుణ పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఇది టిఆర్ ఎస్ పతనానికి నాంది అని అరుణ వర్ణించారు.

 

గట్టు సర్పంచ్ సంతోషమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరికతో టీఆర్ఎస్ కు షాక్ తగిలిందని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం గద్వాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గట్టు సర్పంచమ్మ, .ముగ్గురు వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డీకే అరుణ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

 

వేధింపులు తట్టుకోలేకనే...సర్పంచ్

 

గత రెండున్నర యేళ్ళుగా టీఆర్ఎస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అలాగే అధికారులు కూడ వేధింపులకు గురి చేశారని సంతోషమ్మ  ఆవేదన తో అన్నారు. వ్యక్తం చేసింది . ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. . ప్రతి పనిలో అడ్డు తగులుతూ మండల అభివృధిని అడ్డుకున్నారని ఆరోపించారు.

 

ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అదికార పార్టీ నాయకులకు గులాంలుగా మారి ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని ఎమ్మెల్యే అరుణ విమర్శించారు. ఉన్నత అదికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం మానుకోవాలని  అలా కాకపోతే, ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమయింద ని అన్నారు.

 

click me!