తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ లో పండే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆదివారం సమావేశమై దిశానిర్దేశం చేశారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మళ్లీ ఈరోజు నిరసనలకు పిలుపునిచ్చింది. వరి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యింది. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, రైతులకు పిలుపునిచ్చింది.
తెలంగాణ రైతు సమస్య ఢిల్లీకి వినిపించాలి.. కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర తీరు సరిగా లేదని అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలతో, మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో ఇతర జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో నేడు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
undefined
పోడుభూముల వివాదం...ఐదెకరాల కోసం ఆదివాసీ రైతు ఆత్మహత్య
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు విన్నవించినా స్పందించడం లేదని అన్నారు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు లెటర్‌లు రాశారని తెలిపారు. పలు మార్లు ప్రధాన మంత్రికి కూడా లేఖ రాశారని అన్నారు. కేంద్ర తన రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటుందే తప్ప రైతుల మంచి కోసం పని చేయడం లేదని తెలిపారు.
ఢిల్లీలో తెలంగాణ క్యాబినేట్ మకాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం.. !
ధాన్యం కొనుగోలు చేయాలని పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారని, కేంద్ర మంత్రులను కలిసి పలుమార్లు విన్నవించారని చెప్పారు. అయినా కేంద్ర స్పందించడం లేదని అన్నారు. ఇప్పటి కూడా మంత్రులు, ఎంపీలు కలిసి ఢిల్లీకి వెళ్లారని, ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని అన్నారు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామల్లో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మంచి సముచితమైన నిర్ణయం తీసుకునేంత వరకు పలు రూపాల్లో నిరసనలు తెలుపుతూనే ఉండాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ సరికొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తోంది. అందులో భాగంగా మూడు నల్లచట్టాలని తీసుకొచ్చిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు నిర్వహించారని తెలిపారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండంతో ఆ నల్ల చట్టాలపై వెనక్కితగ్గిందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలిపారు. యాసంగి సీజన్‌లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాలను రైతుల అందరి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.