అధికార టీఆర్ఎస్ పార్టీలో అలజడి.... ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్య బైటపడ్డ విభేదాలు

By Arun Kumar PFirst Published Aug 28, 2018, 5:45 PM IST
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో అధికార పార్టీ నాయకుల మధ్య బైటపడుతున్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. కొన్ని చోట్ల ప్రస్తుత
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మిగతా నాయకులంతా జట్టుకడుతున్నారు. వీరంతా కలిసి మళ్లీ ఈ సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వవద్దని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు. దీంతో
పార్టీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో అధికార పార్టీ నాయకుల మధ్య బైటపడుతున్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. కొన్ని చోట్ల  ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మిగతా నాయకులంతా జట్టుకడుతున్నారు. వీరంతా కలిసి మళ్లీ ఈ సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వవద్దని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు. దీంతో పార్టీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది.

తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, అదే పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు మధ్య నెలకొన్న విభేదాలు బైటపడ్డాయి. ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాల్లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపి వినోద్ కుమార్,ఎమ్మెల్యే బోడిగ శోభ లతో పాటు ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

అయితే ఈ నియోజకవర్గంలోని ఫైర్ స్టేషన్ భవన ప్రారంభోత్సవానికి మంత్రి స్థానిక మార్కెట్ కమిటీ ఛైర్మన్ చుక్కారెడ్డితో కొబ్బరికాయ కొట్టించారు. ఇతడితో విభేదాలున్న నేపథ్యంలో ఎమ్మెల్యే శోభ అతన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మంత్రి,ఎంపి ఎదురుగానే వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి  అక్కడి నుండి వెళ్లిపోయారు.  

మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కారెడ్డి కూడా మంత్రి ఈటల వద్ద తన ఆవేధనను వెల్లగక్కాడు. ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కంటతడి పెట్టుకున్నాడు. దీంతో ఈటల అతన్ని సముదాయించారు.

click me!