అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం:100స్థానాల్లో విజయంపై ధీమా

By Nagaraju TFirst Published Oct 21, 2018, 6:27 PM IST
Highlights

టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాన్ని వేగవంతం చెయ్యాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాన్ని వేగవంతం చెయ్యాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. 

నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజెయ్యాలని సూచించారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతు బంధు వంటి ప్రభుత్వ పథకాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఆయా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి గణాంకాలను పుస్తక రూపంలో అభ్యర్థులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. 

దీంతో అభ్యర్థులు ఆయా లబ్ధిదారుల వద్దకు వెళ్లి టీఆర్ఎస్ కు ఓటు వేసే విధంగా ప్రయత్నించాలని ఆదేశించారు. మరోవైపు రైతుల ఓట్లు కచ్చితంగా టీఆర్ఎస్ కు వచ్చేలా ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలను రైతులకు వివరించాలని సూచించారు. అలాగే రైతు బంధ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది రైతులు లబ్ధిపొందారని వారిని కలిసి ఓట్లు అడగాలని కోరారు. 

click me!