ప్రేమించాలంటూ 8మంది బెదిరింపులు:తాళలేక యువతి ఆత్మహత్య

Published : Oct 21, 2018, 05:16 PM IST
ప్రేమించాలంటూ 8మంది బెదిరింపులు:తాళలేక యువతి ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమలగిరికి చెందిన ఓ యువతిని 8మంది యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడుతున్నారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నరకం అనుభవిస్తోంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోన మనోవేదనకు గురైంది. 

హైదరాబాద్:హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమలగిరికి చెందిన ఓ యువతిని 8మంది యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడుతున్నారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నరకం అనుభవిస్తోంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోన మనోవేదనకు గురైంది. 

అయితే పోకిరీల ఆగడాలు రోజురోజుకు శృతిమించాయి. ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో పోకిరీల వేధింపులను తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అనిరుధ్, కావ్య పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడో రివీల్ చేసిన తెలంగాణ సీఎం
Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే