కేసీఆర్ విజన్ లెస్ లీడర్:రాం మాధవ్

Published : Oct 21, 2018, 06:03 PM IST
కేసీఆర్ విజన్ లెస్ లీడర్:రాం మాధవ్

సారాంశం

దేశంలో టీఆర్ఎస్ పార్టీ కంటే అవినీతి పార్టీ మరోకటి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేకపోవడానికి టీఆర్ఎస్సే కారణం అని ధ్వజమెత్తారు. 

హైదరాబాద్‌: దేశంలో టీఆర్ఎస్ పార్టీ కంటే అవినీతి పార్టీ మరోకటి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేకపోవడానికి టీఆర్ఎస్సే కారణం అని ధ్వజమెత్తారు. ఆదివారం మల్కాజ్‌గిరిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాంమాధవ్ కేసీఆర్ విజన్ లేని నాయకుడు అంటూ దుయ్యబుట్టారు. 

తెలంగాణలో చేతకాని ప్రభుత్వం పాలన చేసిందంటూ టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని, ఆపార్టీకి 50 సీట్లు రావడం కూడా గగనమేనని అన్నారు. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ లపైనా మండిపడ్డారు. తెలుగుదేశం తెలుగు ద్రోహుల పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట తిరుగుతున్నారని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌