విబేధాలు ఉంటే పరిష్కరించుకుందాం, వలస శక్తులకు అవకాశం ఇవ్వొద్దు: కేసీఆర్ పిలుపు

Published : Dec 05, 2018, 04:48 PM IST
విబేధాలు ఉంటే పరిష్కరించుకుందాం, వలస శక్తులకు అవకాశం ఇవ్వొద్దు: కేసీఆర్ పిలుపు

సారాంశం

 మనలో మనకు ఎన్ని విబేధాలు ఉన్నా మనమే పరిష్కరించుకుందామని అంతేకానీ వలస శక్తులకు అవకాశం ఇవ్వొద్దని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగింపు సభలో పాల్గొన్న కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణను ఇతరుల పాల్జేయోద్దని కోరారు. 

గజ్వేల్: మనలో మనకు ఎన్ని విబేధాలు ఉన్నా మనమే పరిష్కరించుకుందామని అంతేకానీ వలస శక్తులకు అవకాశం ఇవ్వొద్దని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగింపు సభలో పాల్గొన్న కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణను ఇతరుల పాల్జేయోద్దని కోరారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని మనమే పరిష్కరించుకుందామని ఎవరో పాలిస్తే వారి కింద మనం బానిసలుగా బతకొద్దన్నారు. ఢిల్లీకి గులాములు కావొద్దని, దరఖాస్తు పట్టుకుని అమరావతి పోయే పరిస్థితి రానీయోద్దు పిలుపునిచ్చారు. మళ్లీ బానిస బతుకులు మనకు వద్దు అని తెలంగాణ సమాజం ఆలోచించి ఓటు వెయ్యాలని కోరారు. 

ఒకప్పటి తెలంగాణను విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, కొద్దికాలంగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని పిలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడిందని, తెలంగాణ అబివృద్ధిని అడ్డుకుందని, తాజాగా కృష్ణా నదిలో నీరుపై పేచీ పెడుతుందని ఆరోపించారు. అటు నాలుగున్నరేళ్లపాటు తెలంగాణ అభివృద్ధికి  కేంద్రప్రభుత్వం సహకరించలేదని అందువల్ల బీజేపీని ఆదరించవద్దని పిలుపునిచ్చారు. ఇవన్నీ ఆలోచించి తెలంగాణ అభివృద్ధికి పాటుపడిన టీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నన్ను నరికేందుకు చంద్రబాబు భుజంపై గొడ్డలితో తిరుగుతన్నాడు: కేసీఆర్

గజ్వేల్ సెంటిమెంట్ పై కేసీఆర్ ఏమన్నారంటే...

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం