నాగార్జునసాగర్ బైపోల్: మండలాలకు టీఆర్ఎస్ ఇంచార్జీలు వీరే

By narsimha lodeFirst Published Mar 29, 2021, 3:25 PM IST
Highlights

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  ప్రచారం కోసం  టీఆర్ఎస్ నాయకత్వం  మండలాలవారీగా ఇంచార్జీలను నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 
 

నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  ప్రచారం కోసం  టీఆర్ఎస్ నాయకత్వం  మండలాలవారీగా ఇంచార్జీలను నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

also read:నోముల భగత్‌కు బీపాం అందించిన కేసీఆర్

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ ను టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.  తిరుమలగిరి సాగర్‌కు రమావత్‌ రవీంద్రకుమార్‌ (దేవరకొండ ఎమ్మెల్యే),, హాలియా పట్టణానికి కోరకంటి చందర్‌ (రామగుండం ఎమ్మెల్యే),పెద్దవూరకు బాల్క సుమన్‌ (చెన్నూర్‌ ఎమ్మెల్యే),గుర్రంపోడ్‌కు కంచర్ల భూపాల్‌రెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే) నిడమనూరుకు నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ ఎమ్మెల్యే),
త్రిపురారానికి బాణోత్‌ శంకర్‌నాయక్‌ (మహబూబాబాద్‌ ఎమ్మెల్యే),అనుముల మండలనికి  కోనేరు కోనప్ప (సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే)లను ఇంచార్జీలుగా నియమించారు.సాగర్‌ పురపాలికకు సునీల్‌రావు (కరీంనగర్‌ మేయర్‌) లు ఇంఛార్జీగా టీఆర్ఎస్ నాయకత్వం నియమించింది.

ఈ స్థానంలో విజయం కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

click me!