నోముల భగత్‌కు బీపాం అందించిన కేసీఆర్

By narsimha lodeFirst Published Mar 29, 2021, 3:14 PM IST
Highlights

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న  టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్ భీ పాం అందించారు.
 


హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న  టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్ భీ పాం అందించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.  ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్ ను బరిలోకి దింపింది. 

సోమవారం నాడు మధ్యాహ్నం  నోముల భగత్ ఆయన తల్లి లక్ష్మి టీఆర్ఎస్  భవన్ కు చేరుకొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో నోముల భగత్ కు బీఫాం అందించారు.

ఎన్నికల ప్రచారం కోసం భగత్ కు సీఎం కేసీఆర్ రూ. 28 లక్షల చెక్ ను అందించారు. నోముల భగత్ కు   టీఆర్ఎస్ సీటును ఖరారు చేయడంతో ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిని చూపిన  ఎంసీ కోటిరెడ్డిని మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. కోటిరెడ్డిని టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగిస్తున్నారు. కోటిరెడ్డికి పార్టీ నాయకత్వం న్యాయం చేస్తోందని టీఆర్ఎస్ అధినేత హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాాగుతోంది.
 

click me!